రేపు కేసీఆర్ క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం

HNK: హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రేపు బుధవారం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రికెట్ పోటీలను శాసనమండలి ఉపసభాపతి డాక్టర్ బండ ప్రకాష్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.