కోతుల బెడద.. సర్పంచ్ చొరవతో పరిష్కారం

కోతుల బెడద.. సర్పంచ్ చొరవతో పరిష్కారం

NLR: కలువాయి మండలం దాచూరు గ్రామంలో కోతుల బెడద ఎక్కువైంది. చిన్న చిన్న పెరటి మొక్కలను ధ్వంసం చేస్తున్న కోతులపై గ్రామస్తులు సర్పంచ్ రాజుల అనురాధ శ్రీనివాసులురెడ్డికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సర్పంచ్, కోతులు పట్టేవారిని పిలిపించి వాటిని పట్టుకున్నారు. పట్టుకున్న కోతులను ఊరికి దూరంగా అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని వారు తెలిపారు.