వనపర్తిలో పందుల బెడద

వనపర్తిలో పందుల బెడద

WNP: వనపర్తి పురపాలక సంఘం పరిధిలో పందుల సంచారం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గుంపులుగా తిరుగుతున్న పందుల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు రోడ్లపై నడవాలంటే భయపడుతున్నారు. అంతేకాకుండా ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాలను పందులు మురికి గుంతలుగా మార్చేస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.