సీఎం రేవంత్ రెడ్డితో మధ్యప్రదేశ్ సీఎం భేటీ
TG: సీఎం రేవంత్ రెడ్డిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మోహన్ యాదవ్‌కు సీఎం రేవంత్ వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి ముఖ్య కార్యక్రమాల వివరాలను కూడా తెలియజేశారు.