శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటాం: పొన్నం

శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటాం: పొన్నం

TG: ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతున్నామన్నారు.