పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించిన ఎంపీడీవో

పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించిన ఎంపీడీవో

AKP: మాకవరపాలెం మండలం బీఎస్.పేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న పంచాయతీ భవనాన్ని ఎంపీడీవో ఛాయాదేవి మంగళవారం పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకుని, నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా భవన నిర్మాణం ఉండాలని తెలిపారు. పనులు నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.