'మౌలిక సదుపాయాల విస్తరించండి'
SKLM: పలాసకు చెందిన ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు గురువారం సచివాలయంలో ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి గోపాలకృష్ణ, సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్ బాబులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలాస నియోజకవర్గంలోని PHC, CHCలను అభివృద్ధి చేయాలన్నారు. అలాగే, కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్‌లో మౌలిక సదుపాయాలను విస్తరించాలని కోరారు.