ఈనెల 17 నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు
HYD: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రొఫెసర్ శ్రీనివాస్ తెలియజేశారు. పరీక్షకు మూడు రోజుల ముందు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.