పిడుగుపడిన ఘటనపై తహసీల్దార్ విచారం

E.G: తాళ్లపూడి మండలం, అన్నదేవరపేటలో ఇంటిపై పిడుగుపడి బొర్రా వీరలక్ష్మీకి 70% శరీరం కాలిపోయిన ఘటనపై తహసీల్దార్ భారతీ విచారం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. తక్షణమే అక్కడున్న తాను, ASO, VROల వద్ద ఉన్న రూ. 8 వేలను సహాయంగా అందజేశామన్నారు. వైద్యునితో ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడామన్నారు.