వేర్వేరు దాడి ఘటనలు.. 17 మంది మృతి

కొలంబియా కాలిలో కారు బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 36 మంది గాయపడ్డారు. సైనిక స్కూల్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మెడెల్లిన్ నగరంలో పోలీస్ హెలికాప్టర్‌పై దాడి జరగగా.. 12 మంది మరణించారు. వీరిలో 8 మంది పోలీసులు ఉన్నారు. విప్లవ సాయుధ దళాలు ఈ దాడికి పాల్పడినట్లు ఆ దేశ అధ్యక్షుడు గుస్టావో పెట్రో తెలిపారు.