పత్తికొండలో ఈస్టర్ వేడుకలు

KRNL: పత్తికొండలోని ఆదోని రోడ్డులోని చర్చిలో ఈస్టర్ వేడుకలను నిర్వహించారు. చర్చిలో విశేషాలంకరణలు చేసి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ జోసెఫ్ మాట్లాడుతూ.. గుడ్ ఫ్రైడే రోజున మరణం పొందిన క్రీస్తు ఆదివారం మళ్లీ బతికి వచ్చిన సందర్భంగా ఈస్టర్ వేడుకను జరుపుకుంటారన్నారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి ఆచరణీయమని అన్నారు.