గుట్టలో గణేష్ ఉత్సవాల సందడి

BHNG: వినాయక చవితి పండుగ సందర్భంగా YDD పట్టణ ప్రజలు వినాయక ప్రతిమలతో పాటు పత్రిలు, పండుగ సామాగ్రిని కొనుగోలు చేయడానికి రోడ్లపైకి రావడంతో ప్రధాన కూడళ్లు, రోడ్లు సందడిగా మారింది. భక్తులు వినాయక ప్రతిమలు కొనుగోలు చేసుకుని ఇంటికి తీసుకు వెళుతున్నారు. ఈ పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకోవాలని ఆలేరు శాసనసభ్యుడు B.ఐలయ్య పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.