రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలి: కలెక్టర్
పార్వతీపురంలో జరిగిన రక్తదాన శిబిరంలో, రక్తదానం మహాదానమని, రక్తదానం పట్ల ఉన్న అపోహలను వీడి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి యువత, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. మనం ఇచ్చే రక్తం మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తుందని గుర్తుచేశారు. ఒకరి ప్రాణాన్ని కాపాడేందుకు రక్తం ఇవ్వడం అత్యంత గొప్ప సేవా కార్యక్రమమని ఆయన కొనియాడారు.