లెక్చరర్స్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడుగా సుందర్రావు

లెక్చరర్స్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడుగా సుందర్రావు

AKP: జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కె. సుందర్రావు(మాకవరపాలెం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం అనకాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షుడిగా ఆర్.గంగరాజు,కార్యదర్శిగా కె. ప్రేమ్ కుమార్, మహిళ కార్యదర్శిగా పీఆర్ కళ్యాణి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా బి. ఉమారాణిని ఎన్నుకున్నారు.