హంస వాహనంపై కొలువుదీరిన నరసింహస్వామి

హంస వాహనంపై కొలువుదీరిన నరసింహస్వామి

NLR: నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి చప్పరఉత్సవం, హంస వాహనంపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. విశేష పుష్ప అలంకరణ, మంగళ వాయిద్యాలతో స్వామి వారి గ్రామోత్సవం ఘనంగా సాగింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.