రేపు ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష
ATP: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఇంచార్జ్ డీఈఓ శ్రీనివాస్ రావు తెలిపారు. ఏ మండలంలో దరఖాస్తు చేసుకున్నారో అక్కడే పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. ఉదయం 10 నుంచి 12:00 వరకు ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.