గ్రామ వీధుల్లో విద్యార్థులు ర్యాలీ
CTR: పెద్దపంజాని మండలం రాయలపేటలో “మన ఊరి బడిని కాపాడుకుందాం” అనే కార్యక్రమాన్ని శుక్రవారం UTF సంఘ నాయకులు చేపట్టగా ఉపాధ్యాయులు భాగస్వామ్యమయ్యారు. శుక్రవారం విద్యార్థులతో కలిసి గ్రామ వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్రస్థాయి నాయకులు GV రమణ, వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.