'రామకోటి రామరాజు ఆధ్యాత్మిక సేవలు అమోఘం'
SDPT: రామకోటి రామరాజు ఆధ్యాత్మిక సేవలు అమోఘమని గజ్వేల్ ACP నర్సింలు అన్నారు. శనివారం గజ్వేల్‌లో రామకోటి సంస్థ ఆధ్వర్యంలో భద్రాచల దేవస్థానంలో జరిగే కార్తీక మాసం ప్రత్యేక పూజల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. రామకోటి రామరాజు చేస్తున్న భక్తి సేవలపై కొనియాడారు. ఇందులో సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు నరేష్ బాబు, బింగి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.