VIDEO: 'సురవరం సుధాకర్ రెడ్డి మృతి అత్యంత బాధను మిగిల్చింది'

ATP: సీపీఐ జాతీయ నాయకుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతి అత్యంత బాధను కలిగించిందని రాయదుర్గం సీపీఐ తాలూకా కార్యదర్శి నాగార్జున పేర్కొన్నారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శనివారం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి ఘననివాళులు అర్పించారు. ఎర్రజెండా ముద్దుబిడ్డ, సైద్ధాంతిక రాజకీయ ఉద్దండులు అలుపెరుగని పోరాట నాయకుడు అంటూ కొనియాడారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు.