నాటు సారా స్థావరాలపై మెరుపు దాడులు..!

నాటు సారా స్థావరాలపై మెరుపు దాడులు..!

KRNL: ఆదోని మండలం దొడ్డనగిరి గ్రామ సమీపంలోని కొండల్లో నాటు సారా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడంతో పాటు 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని ఆదోనికి చెందిన శివ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్ద తుంబలం ఎస్సై విద్యా శ్రీ తెలిపారు.