అంబేద్కర్‌కు విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల వినతి
RR: తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ చేపట్టిన సమ్మె 7వ రోజుకు చేరింది. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, షాద్ నగర్ డివిజన్ జేఏసీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.