దేవాలయ సిబ్బందికి సూచనలు చేసిన ఎస్సై

దేవాలయ సిబ్బందికి సూచనలు చేసిన ఎస్సై

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దైవ దర్శనం కోసం కార్తిక సోమవారం సందర్భంగా భక్తులు భారీగా రానున్నారు.  ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత దర్శన వాతావరణం కల్పించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్రహ్మంగారిమఠం ఎస్సై శివప్రసాద్ దేవాలయ సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.