బల్దియాను అభివృద్ధి చేస్తా: మంత్రి

బల్దియాను అభివృద్ధి చేస్తా: మంత్రి

SRD: కాంగ్రెస్‌తోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జోగిపేట మూడో వార్డులో సోమవారం మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే బల్దియాను విద్యా, వైద్య రంగాల్లో మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.