పోలీసు కుటుంబసభ్యులకు నియామక పత్రాలు అందజేత
NLR: విధులు నిర్వహిస్తూ అకాల మరణం పొందిన పోలీసు కుటుంబ సభ్యులకు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. మరణించిన ముగ్గురు పోలీసు కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ప్రకారం టైపిస్టులుగా అపాయింట్ మెంట్ ఆర్డర్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసు శాఖ క్రమశిక్షణతో కూడిందని.. సమయపాలన పాటిస్తూ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.