నేలకొండపల్లి సీహెచ్‌సీలో అత్యవసర సిజేరియన్
KMM: నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి తల్లీబిడ్డలను కాపాడారు. దానవాయిగూడెంకు చెందిన చందనకు ఉమ్మనీరు తగ్గి ప్రసవం సంక్లిష్టం కావడంతో డాక్టర్ మంగళ బృందం సిజేరియన్ చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కేంద్రంలో ఇకపై సిజేరియన్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని వైద్యులు తెలిపారు.