విద్యార్థులకు GOOD NEWS

విద్యార్థులకు GOOD NEWS

AP: పదో తరగతి విద్యార్థులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు పదో తరగతి పరీక్షలు రాసే వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందన్నారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని చెప్పారు.