'ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ దరఖాస్తులకు రేపే ఆఖరు తేదీ'

'ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ దరఖాస్తులకు రేపే ఆఖరు తేదీ'

GDWL: గద్వాల జిల్లాలోని విద్యార్థులు ఓపెన్ ఎస్సెస్సీ, ఓపెన్ ఇంటర్ కోర్సులలో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ సునీతమ్మ బుధవారం తెలిపారు. ​ఈ నెల 31వ తేదీలోగా విద్యార్థులు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. చదువు మానేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.