ఈ మండలాల్లో ఈదురుగాలుల బీభత్సం

ఈ మండలాల్లో ఈదురుగాలుల బీభత్సం

ASF: కెరమెరి, తిర్యాని మండలాలలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో 48.8mm  వర్షపాతం నమోదైంది. కెరమెరిలో ఈదురుగాలులతో పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. కేలి (బి) గ్రామంలో భారీ చెట్టు విద్యుత్ తీగలపై నుంచి అక్కడే ఉన్న ట్రాక్టర్‌తో పాటు పక్కనే ఉన్న ఇంటిపై నేలకొరిగింది. ఆ సమయంలో విద్యుత్ అంతరాయం ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.