నేడు విశాఖ‌లో రాజ్‌నాథ్ పర్య‌ట‌న‌

నేడు విశాఖ‌లో రాజ్‌నాథ్ పర్య‌ట‌న‌

VSP: విశాఖపట్నంలో శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నావల్ డాక్‌యార్డులో స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ NNS త‌రంగిరిని భారత నౌకాదళంలోకి లాంఛనంగా ప్రవేశపెట్టనున్నారు. ప్రాజెక్ట్ 17ఏ కింద రూపొందిన ఈ యుద్ధనౌక దేశ స్వయం సమృద్ధికి ప్రతీకగా నిలవనుంది. మంత్రి పర్యటన దృష్ట్యా నగరంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.