ఆదర్శనీయం రంగనాథన్ జీవితం: వంగవీటి రామారావు

SRPT: గ్రంథాలయ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఎస్‌ఆర్ రంగనాథన్ జీవితం ఆదర్శనీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహుడు రంగనాథన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. రంగనాథన్ గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేసిన సేవలను కొనియాడారు.