అదుపుతప్పి బోల్తా పడ్డ లారీ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

KMM: రూరల్ మండలం రామన్నపేట ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆలయం వద్ద కల్వర్టు నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన డైవర్షన్, రోడ్డుపై లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.