గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

మేడ్చల్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ నాసిక్ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పరిశీలన జరుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.