సినర్జీస్ కార్మికుల ఆందోళనకు వైసీపీ మద్దతు
VSP: గాజువాకలోని దువ్వాడలో గల సినర్జీస్ క్యాస్టింగ్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు గత ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో వారు చేస్తున్న నిరసన కార్యక్రమానికి వైసీపీ మద్దతు తెలిపింది. మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, నియోజకవర్గ సమన్వయకర్త దేవన్ రెడ్డి కార్మికుల సోమవారం నాటి ఆందోళనలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు.