సరిహద్దులో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం?
తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో నిన్న మధ్యాహ్నం ఆపరేషన్ చేపట్టిన బలగాలు వారిని చుట్టుముట్టాయి. దీంతో ఎదురుకాల్పులు జరగ్గా.. ఘటనాస్థలి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.