కోడూరు గ్రామంలో మార్పు తెద్దాం: ఎమ్మెల్యే

కోడూరు గ్రామంలో మార్పు తెద్దాం: ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ జిల్లాలోని కోడూరు గ్రామంలో ప్రజలు మార్పుకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఈటే ఉమాదేవి రవీందర్‌కు మద్దతుగా ప్రకటించి, ప్రచారం నిర్వహించి మాట్లాడారు.