ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పెంచాలి: కలెక్టర్

NLG: నల్గొండ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పెంచాలని కలెక్టర్ త్రిపాఠి అన్నారు. మున్సిపల్ ఆఫీస్‌లో గురువారం ఇండ్ల పురోగతిపై హౌసింగ్ అధికారులు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. మొదటి, రెండో విడతలో 3337 గృహాలు కేటాయించగా అందులో 1129 గ్రౌండ్ కాగా, బేస్మెంట్ స్థాయిలో 1037 రూఫ్ లెవెల్‌లో 67, పూర్తి దశలో 25 ఉన్నాయని హౌసింగ్ పీడి వివరించారు.