కృష్ణాష్టమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి

కృష్ణాష్టమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి

వరంగల్: శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని నగరంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. మురళీ కృష్ణ మందిరం, ఇస్కాన్ వేణుగోపాల స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారికి అర్చకులు నైవేద్యాలు సమర్పించారు. ఆలయాలకు విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు ఏర్పాట్లు చేశారు.