సాంప్రదాయంగా జరగనున్న శ్రీరాముని కళ్యాణ మహోత్సవం
BHNG: రాజపేటలోని శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో ఈనెల 27వ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్టు అభివృద్ధి సేవా కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం వారు వివరాలు చెబుతూ ఆలయ ట్రస్ట్ శాశ్వత గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ శోభారాణి ఆధ్వర్యంలో జరగనున్నట్లు తెలిపారు.