రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా సీపీఐ: రామకృష్ణ

W.G: రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా సీపీఐ ఎదుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ అన్నారు. సీపీఐ 27వ జిల్లా మహాసభలు మంగళవారం తణుకులో ప్రారంభమయ్యాయి. జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అధ్యక్షతన జరిగిన ఈ సభల్లో ముఖ్యఅతిథిగా రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. తొలుత తణుకులో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం రోటరీ క్లబ్ ప్రాంగణంలో సభను ఏర్పాటు చేశారు.