మైలవరం రిజర్వాయర్‌కు 7500 క్యూసెక్కుల నీరు

KDP: గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్లోకి బుధవారం నీరు విడుదల చేసినట్లు ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. గండికోట జలాశయం నుంచి 3 గేట్లు ఎత్తి 7500 క్యూసెక్కుల నీరు మైలవరం రిజర్వాయర్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. గండికోట జలాశయంలోకి ఇన్ ఫ్లో13,500, ఔట్ ఫ్లో 8,200 ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జలాశయంలో 20 టీఎంసీల నీరు నిలువ ఉన్నట్లు వివరించారు.