స్థానిక ఎన్నికల బరిలో ఇద్దరు జవాన్లు

స్థానిక ఎన్నికల బరిలో ఇద్దరు జవాన్లు

GDWL: దేశ సరిహద్దుల్లో సేవలు చేసిన జవాన్లు ఇప్పుడు గ్రామ సేవ చేసేందుకు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. ఉండవల్లి మండలం మారమునగాల 2 గ్రామానికి చెందిన ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ సురేష్ గౌడ్, ఇదే గ్రామానికి చెందిన రిటైర్డ్ టెన్త్ బేటాలియన్ ఏఎస్సై కమతం శ్రీనివాసులు రిజర్వేషన్ లో భాగంగా బీసీ జనరల్ కావడంతో సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసేందుకు శుక్రవారం నామినేషన్ వేశారు.