ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

NLG: జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంప్ కార్యాలయం సమీపంలోని మున్సిపల్ పార్క్ వద్ద గురువారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులు భారీ ఎత్తున తరలి రావడంతో పార్క్ మొత్తం జనంతో నిండిపోయింది. వారికి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.