అమరవీరుడి కూతురి పెళ్లి.. కదిలొచ్చిన సైన్యం
అమరవీరుల కుటుంబానికి మేం ఉన్నామంటూ ఆర్మీ భరోసానిచ్చింది. 16 ఏళ్ల క్రితం దంతెవాడ నక్సల్ ఆపరేషన్‌లో కోబ్రా అసిస్టెంట్ కమాండెంట్ రాకేశ్ చౌరాసియా వీరమరణం పొందారు. తాజాగా రాకేశ్ కుమార్తె పెళ్లి జరుగుతుందని తెలుసుకున్న కోబ్రా యూనిట్ ఈ వేడుకకు హాజరైంది. వీరితో పాటు కోబ్రా డీజీ కూడా హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.