ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయండి

SKLM: పోలాకి మండలం, కోడూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం ఉదయం 5 గంటలకు కోడూరు పరిసరప్రాంత గ్రామాలు అయిన జోగంపేట, కొత్త చెరువు ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి పూర్తి చేసుకొని, వచ్చే విద్యా సంవత్సరం ఆరవ తరగతికి వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చి, పాఠశాలల బలోపేతానికి సహకరించాలని కోరారు.