గణేశుడి లడ్డూ రూ.2.64 లక్షలకు వేలం

గణేశుడి లడ్డూ రూ.2.64 లక్షలకు వేలం

సత్యసాయి: పుట్టపర్తి మండలం కుమ్మరిపేటలో ఏర్పాటు చేసిన పర్తి వినాయక విగ్రహం వద్ద శనివారం లడ్డూ వేలంపాట జరిగింది. కమిటీ సభ్యుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువకుడు రూ.2,64,000 చెల్లించి లడ్డూను సొంతం చేసుకున్నాడు. సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులు యువకుడిని సన్మానించారు.