బాధిత కుటుంబానికి రూ. 20వేల ఆర్థిక సాయం

నల్గొండ: కేతపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ఆల్దాస్ అంజయ్య అనారోగ్యంతో ఇటీవల మరణించారు. అంజయ్య నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి దీంతో గ్రామానికి చెందిన నేస్తం గ్రూపు సభ్యులు రూ. 20వేలు ఆర్థిక సాయంతో పాటు 2 క్వింటాల బియ్యం అంజయ్య భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నేస్తం గ్రూప్ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.