'త్వరలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌లను కలుస్తా'
NLG: నక్కలగండి ప్రాజెక్టును జాగృతి అధ్యక్షురాలు కవిత ఇవాళ సందర్శించారు. అక్కడ నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిహారం అందలేదని, పనులు నాణ్యత లేకుండా జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. 18 ఏళ్లు నిండిన వారికి కూడా పరిహారం ఇవ్వాలని, రైతులకు ప్రభుత్వ ప్రయోజనాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి CM రేవంత్, మంత్రి ఉత్తమ్‌లను త్వరలో కలుస్తానని హామీ ఇచ్చారు.