డిజిటల్ ఫ్రాడ్‌కు 85% వరకు పరిహారం!
ఆన్‌లైన్ మోసాలు బారిన పడి డబ్బులు కోల్పోయిన బ్యాంకు కస్టమర్లకు RBI సరికొత్త ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం బాధితులు కోల్పోయిన మొత్తంలో 85% లేదా గరిష్ఠంగా రూ.25 వేల పరిహారం పొందే ఛాన్స్ ఉంది. ఈ ప్రయోజనాన్ని ఒక కస్టమర్ ఒక్కసారి మాత్రమే పొందగలరు. మోసం జరిగిన 5 రోజుల్లోపు బ్యాంకుకు, నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930)కు ఫిర్యాదు చేయాలి.