ఉపాధ్యాయులతో సీఐ సమావేశం
VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు కొత్తవలస జెడ్పీ పాఠశాలలో సీఐ షణ్ముఖరావు ఆద్వర్యంలో ఎంఈఓలు శ్రీదేవి, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులతో శనివారం సమావేశం ఏర్పాటుచేశారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు మంచి ప్రవర్తనతో నడుచుకోవాలని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధాన ఉపాధ్యాయుడు సిహెచ్ ఈశ్వరరావు పాల్గొన్నారు.