వడ్డీ వ్యాపారుల వేధింపులు.. కారుణ్య మరణం కోరిన వ్యాపారి
అన్నమయ్య: కోడూరుకు చెందిన వ్యాపారి మోహన్ రాజు, వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక తన దుకాణం ముందు 'నాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండి' అని బోర్డు పెట్టారు. ఈ మేరకు కరోనా కాలంలో వ్యాపారం నష్టపోయి అప్పులు చెల్లించలేకపోతున్నానని, కొంతమంది వడ్డీ వ్యాపారులకు బకాయిలు చెల్లించినా, బాండ్లు, చెక్కులు ఇవ్వకుండా నిరంతరం వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.